Header Banner

ఆ 3 బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ! లిస్టులో ఏపీ గుంటూర్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ కూడా!

  Thu Feb 27, 2025 19:36        Business

దేశంలోని అన్ని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు నియంత్రణ సంస్థగా భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక ఇవన్నీ ఆర్బీఐ కనుసన్నల్లోనే పనిచేస్తుంటాయి. ఆర్బీఐ అనుమతులు, అంగీకారంతోనే కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా.. బ్యాంకులు, NBFC ల కోసం ఆర్బీఐ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తుంటుంది. ఈ నియమ నిబంధనలకు లోబడి అవి పనిచేయాల్సి ఉంటుంది. ఇక వాటిని పట్టించుకోకుండా నిబంధనల్ని ఉల్లంఘించినట్లయితే ఆర్బీఐ చర్యలు కూడా తీసుకుంటుంది. ఇక్కడ చర్యలు పలు రకాలుగా ఉంటాయి. ఎక్కువగా జరిమానాలతో సరిపెట్టినా.. కొన్ని సార్లు సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే అప్పుడు ఏకంగా బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసే అవకాశమూ ఉంటుంది. 

 

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్ ఉన్న సమయంలో.. చాలా దూకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ సహా చాలా ప్రముఖ సంస్థలపైనా చర్యలు తీసుకుంది ఆర్బీఐ. నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఎవర్నీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు 3 సహకార బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్ ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో మూడింటికీ జరిమానా విధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒక బ్యాంకు ఉంది. 

 

ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అది గుంటూర్ డిస్ట్రిక్ కో- ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం - 1949 (BR Act) సెక్షన్ 36, సెక్షన్ 56 కింద నిబంధనల్ని ఉల్లంఘించినందుకు రూ. 50 వేల జరిమానా విధించినట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ సర్క్యులర్ విడుదల చేసింది. ఇక్కడ ఆర్బీఐ మార్గదర్శకాల్ని పట్టించుకోకుండా బ్యాంక్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు తన అకౌంట్లు, బ్యాలెన్స్ షీట్ వివరాల్ని ప్రచురించలేకపోయింది. ఇదే సమయంలో కాపీలను ఆర్బీఐ, నాబార్డ్‌లకు అందించడంలోనూ విఫలమైంది. ఈ నేపథ్యంలో.. ఆ బ్యాంకుకు జరిమానా ఎందుకు విధించకూడదో ప్రశ్నించి.. బ్యాంక్ రిప్లై అనంతరం జరిమానాతో సరిపెట్టింది. 

 

ఈ బ్యాంకుకు ఇప్పుడు జరిమానాతో సరిపెట్టింది గానీ.. ఇలాంటివే పునరావృతం అయితే కఠిన ఆంక్షలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొన్ని సార్లు బ్యాంక్ లైసెన్సులు రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆర్బీఐ ఎక్కువగా.. సహకార బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపైనే చర్యలు తీసుకుంటుంటుంది. వీటిల్లో మూలధన నిల్వలు తక్కువగా ఉండటమే కారణం. గుంటూర్ డిస్ట్రిక్ట్ బ్యాంకుతో పాటు.. ఆర్బీఐ మహిళా సహకారి బ్యాంకు (వడోదరా, గుజరాత్), గుల్బర్గా అండ్ యాద్‌గిర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులపైనా (కర్ణాటక) చర్యలు తీసుకుంది. వీటికి వరుసగా రూ. 25 వేలు, రూ. 50 వేల చొప్పున జరిమానా విధించింది.

 

ఇది కూడా చదవండి
వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!  

 

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు! 

 

గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!  

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!  

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #RBI #Banks #Guntur #ReserveBank